![]() |
![]() |
.webp)
దీపావళి రోజున ప్రతీ ఇంట్లో పూలు, దీపాలతో అలంకరించి గ్రాంఢ్ గా జరుపుకుంటున్నారు. అయితే కొందరు సెలబ్రిటీలు అవుట్ డోర్ షూటింగ్ అంటు బిజీగా ఉంటే, మరికొందరు తమ ఫ్యామిలీని కలవడానికి సొంతింటికి వెళ్తున్నారు. అదే కోవలోకి శ్రీముఖి చేరింది. శ్రీముఖి తన అమ్మనాన్నలు కలిసి దీపావళి పండుగ జరుపుకుంది. శ్రీముఖీ వాళ్ల అమ్మనాన్నలకి సర్ ప్రైజ్ అని చెప్పగానే .. వాళ్ళు షాక్ అయ్యారు. ఇక సస్పెన్స్ కి తెరతీస్తూ అమ్మకి డైమండ్ నక్లెస్, నాన్నకి బంగారపు గొలుసు గిఫ్ట్ గా ఇచ్చింది శ్రీముఖి. అయితే ఇలాంటి గిఫ్ట్ లు తనకి ప్రతీ నెల కావాలంటూ శ్రీముఖి వాళ్ళ అమ్మ చెప్పుకొచ్చింది.
శ్రీముఖి.. టెలివిజన్ రంగంలో యాంకరింగ్ తో తన సత్తా చాటుతుంది. టీవిరంగంలోనే కాకుండా సినిమాలల్లో కూడా నటిస్తుంది శ్రీముఖి. బిగ్ బాస్ సీజన్-3 లో రన్నరప్ గా నిలిచింది. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమాల్లో వరుస ఆఫర్స్ తో బిజీ అయింది శ్రీముఖి. జులాయి సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లెలు పాత్రలో కనిపించిన శ్రీముఖి.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిబి జోడీలో యాంకర్ గా చేసిన శ్రీముఖి పలు టీవి షోస్ , ఆడియో ఫంక్షన్స్ తో గుర్తింపు తెచ్చుకుంటుంది.
శ్రీముఖి తన హాట్ ఫోటోస్ ని ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి. అయితే తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని అటు యూట్యూబ్ లో వ్లాగ్ లుగా చేసి అప్లోడ్ చేస్తుంది. అయితే శ్రీముఖి తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి థాయ్ లాండ్ వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తన యూట్యూబ్ ఛానెల్ లో దీపావళి స్పెషల్ గా అప్లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
![]() |
![]() |